దసరా వేడుకలకు సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

దసరా వేడుకలకు సర్వం సిద్ధం

Oct 20 2026 4:37 AM | Updated on Oct 20 2026 4:37 AM

● ఏర్పాట్లు పూర్తిచేసిన యంత్రాంగం ● సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్న విశ్వహిందూపరిషత్‌

నిర్మల్‌టౌన్‌: తెలంగాణలో అతిపెద్ద పండుగ దసరా. హిందూ సంస్కృతిలో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా, మహిషాసురుడిపై దుర్గామాత విజయం, రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి సంకేతంగా దసరాను జరుపుకుంటారు. ఆయుధ పూజ, పొలిమేర దాటడం, జమ్మి చెట్టు పూజ, పాలపిట్ట దర్శనం వంటి ఆనవాయితీలు ఆనాటి నుంచి కొనసాగుతున్నాయి.

మహాలక్ష్మి ఆలయం వద్ద ఏర్పాట్లు..

జిల్లా కేంద్రంలోని బంగాల్‌పేట్‌ మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలో దసరా వేడుకలు నిర్వహిస్తారు. సుమారు రెండెకరాల్లో రావణ దహన కార్యక్రమం జరుగుతుంది. ఈమేరకు స్థలం చదును చేయించి, వేదిక, లైటింగ్‌, టెంట్లు, బారికేడ్లు, నీటి సదుపాయం మున్సిపల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. విశ్వహిందూ పరిషత్‌, బంగల్‌పేట్‌ శ్రీఆంజనేయ యూత్‌ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణమంతా మామిడి తోరణాలతో అలంకరించారు. రావణ దహనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలను తిలకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. మహాలక్ష్మి ఆలయం సమీపంలోని ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అప్పాల కావ్య పరిశీలించారు.

ఖానాపూలో...

ఖానాపూర్‌: పట్టణంలోని రాంలీలా మైదా నం(ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రాంగణం)లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మంగళవారం విజయదశమి వేడుకలు నిర్వహించనున్నట్లు సమితి అధ్యక్షుడు మంత్ర రాజ్యం సురేశ్‌, కార్యదర్శి శెట్టి శ్యామ్‌, సభ్యులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లను సోమవారం పరిశీలించారు. ఉదయం 9 గంటలకు పద్మావతినగర్‌లోని శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం నుంచి శివాజీనగర్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వరకు ఆభరణాలను తీసుకెళ్లి పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా రాంలీలా మైదానా నికి తీసుకురానున్నారు. సాయంత్రం 5 గంటలకు విద్యార్థినీ విద్యార్థుల సాంస్కతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 6 గంటలకు శమీ పూజ నిర్వహించిన అనంతరం అతిథుల ప్రసంగాలు ఉంటాయి.

శాశ్వత విగ్రహం ఏర్పాటు..

పట్టణంలోని రాంలీలా మైదానంలో ఏటా ఉత్సవాల నిర్వహణ కోసం ఈ ఏడాది 25 ఫీట్ల ఎత్తు, 7 ఫీట్ల వెడల్పుతో శాశ్వత విగ్రహాన్ని సిద్ధం చేశారు. రాత్రి 7 గంటలకు రావణ దహనం కార్యక్రమం నిర్వహించనున్నారు. వేడుకలకు ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌ ముఖ్య అతిథిగా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంకం మౌనిక మహేందర్‌ అతిథిగా హాజరుకానున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రాంత సహ సేవాప్రముఖ్‌ బలవత్రి గణేష్‌ విశిష్ట అతిథిగా, వక్తగా పాల్గొననున్నారు.

22న బతుకమ్మ వేడుకలు..

ఖానాపూర్‌ పట్టణంలో ఈ నెల 22న బతుకమ్మ పండుగ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమితి ప్రతినిధులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement