క్యాష్‌ కట్టింగ్‌పై వాస్తవాలు తేల్చండి | - | Sakshi
Sakshi News home page

క్యాష్‌ కట్టింగ్‌పై వాస్తవాలు తేల్చండి

Oct 17 2026 8:06 AM | Updated on Oct 17 2026 8:06 AM

● అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

భైంసాటౌన్‌: పట్టణంలోని ఏఎంసీ యార్డులో పంట ఉత్పత్తుల కొనుగోలులో వ్యాపారులు రైతుల నుంచి క్యాష్‌ కటింగ్‌ పేరిట అదనంగా రూ.1.50 కమీషన్‌ వసూలు చేయడంపై ‘సాక్షి’లో ‘భైంసా మార్కెట్‌లో క్యాష్‌ కటింగ్‌’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా స్పందించారు. ఈ మేరకు పట్టణంలోని మార్కెట్‌ యార్డును శుక్రవారం తనిఖీ చేశారు. ముందుగా సోయా కుప్పల వద్దకు వెళ్లి రైతులతో మాట్లాడారు. పంటల కొనుగోలు ప్రక్రియ, తూకం విధానం, రైతులకు కల్పిస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. తర్వాత కమీషన్‌ ఫీజు అదనంగా వసూలు చేస్తున్నారా అని రైతులను అడగగా, వారు అవునని సమాధానం ఇచ్చారు. దీంతో ఏఎంసీ సిబ్బందిపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనంగా కమీషన్‌ ఫీజు వసూలు కథనాలపై వాస్తవాలు తేల్చాలని తహసీల్దార్‌ శశిభూషణ్‌ను ఆదేశించారు. రైతులకు నష్టం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

ఎఫెక్ట్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement