నిర్మల్‌చైన్‌గేట్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అడెల్లి మహా పోచమ్మ ఆలయ ‘గంగనీళ్ల జాతర’కు హాజరుకావాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డిని ఆలయ అధి కారులు ఆహ్వానించారు. నిర్మల్‌లోని ఎమ్మె ల్యే నివాసంలో ఆలయ ఈవో భూమయ్య శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వా న పత్రిక అందజేశారు. జాతరకు సంబంధించిన ఏర్పాట్లను, వివరాలను ఎమ్మెల్యేకు వివరించారు. అక్టోబర్ 17న జాతర వైభవంగా ప్రారంభమై, అక్టోబర్ 18న ముగుస్తుందని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.


