నిర్మల్‌ఖిల్లా: తెలంగాణ రచయితల వేదిక ఆ ధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న జి ల్లాకు చెందిన పలువురిని శుక్రవారం జిల్లాకేంద్రంలోని లయన్స్‌క్లబ్ కార్యాలయంలో సన్మానించారు. ఉదారి నాగదాసు కవితా పురస్కార గ్రహీత మునిమడుగుల రాజారావు, తెలంగా ణ తల్లి రూపశిల్పి, చిత్రకారుడు, ఇటీవలి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిభా పురస్కార గ్రహీత బైరోజు వెంకట రమణాచారిని సత్కరించారు. వేదిక జి ల్లా అధ్యక్షుడు నేరెళ్ల హనుమంతు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉదారి నారాయణ, డాక్టర్ దామెర రా ములు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమణారెడ్డి, అంబటి నారాయణ, పోలీస్ భీమేశ్, పత్తి శివప్రసాద్, మురళీధర్, పురుషోత్తంరావు, జగదీశ్వర్, నాగారం, రాజేశ్వర్ తదితరులున్నారు.


