● జిల్లావ్యాప్తంగా 2,549 దరఖాస్తులు
నిర్మల్‌చైన్‌గేట్: అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు డి మాండ్ పెరిగింది. జిల్లాలోని 89 టీచర్ పోస్టులకు ఇంటర్మీడియెట్ విద్యార్హతతో నోటిఫికేషన్ ఇచ్చా రు. దీంతో జిల్లా వ్యాప్తంగా 2,549 మంది దరఖా స్తు చేసుకున్నారు. అంటే.. ఒక్కో పోస్టుకు 29మంది పోటీపడుతున్నారు. జిల్లాలోని నాలుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 931 అంగన్‌వాడీ కేంద్రాలున్నా యి. కొన్ని కేంద్రాల్లో టీచర్లు, ఆయాలు రిటైర్డ్ కావటంతో చాలాకాలంగా ఖాళీలేర్పడ్డాయి. దీంతో ప క్క సెంటర్ల టీచర్లకు ఇన్‌చార్జి ఇచ్చినప్పటికీ వాటిపై పూర్తి అజమాయిషీ లేక ఆ సెంటర్లలో కనీసం పౌష్టికాహారం అందని పరిస్థితి నెలకొంది. కాగా, భైంసా ప్రాజెక్ట్ పరిధిలో 22 పోస్టులకు 816 దరఖాస్తులు, ఖానాపూర్ పరిధిలో 20 పోస్టులకు 446, ముధోల్ పరిధిలో 12 పోస్టులకు 262, నిర్మల్ పరిధిలో 35 పోస్టులకు 1,025 దరఖాస్తులు వచ్చాయి.
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
టీచర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న 430 హెల్పర్ పోస్టులకు సంబంధించి ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు. కాగా, దరఖాస్తుదారుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభించిన అధికారులు తర్వాత ఇళ్ల పరిశీలన చేయనున్నారు. దరఖాస్తుదారులు గ్రామంలోనే ఉంటున్నారా? లేదా.. అనే వివరాలు సేకరించనున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఇంటర్మీడియెట్‌లో మెరిట్ మార్కులతో పాటు ఇంటర్వ్యూ, అనాథలు, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్ మెన్ కుటుంబీకులకు ప్రాధాన్యత ఇవ్వనుండగా ఆయా వర్గాలకు చెందిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పారదర్శకంగా నియమిస్తాం
అంగన్‌వాడీ టీచర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది. ఎలాంటి పైరవీలకు తావు లేకుండా మెరిట్ ప్రకారమే భర్తీ చేస్తాం. అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరిట్ జాబితా ఏర్పాటు చేయనున్నాం. కలెక్టర్ సమక్షంలో ఇంటర్వ్యూ నిర్వహిస్తాం. దళారులను నమ్మి మోసపోవద్దు.
– జి.వినూత్న, జిల్లా సంక్షేమశాఖ అధికారి


