న్యూస్‌రీల్
ఈసారి సగానికి తగ్గిన సోయా పంట మార్కెట్‌లో ప్రస్తుత ధర ఆశాజనకం తగ్గితే నష్టాలేనని రైతుల్లో ఆందోళన పరిహారంతో ఆదుకోవాలని వేడుకోలు
దిగుబడి డీలా.. ధర భళా!
గుర్తింపు పోరు.. పొలిటికల్ జోరు..!
ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాగా ఆదిలాబాద్ రీజియన్‌లో ప్రచా రం ఊపందుకుంది. రాజకీయ పార్టీలు రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.
ధర నిలకడగా లేకుంటే అంతే?
జిల్లాలో రెండురోజులుగా కోతలు మొదలయ్యాయి. కోతలు పూర్తయ్యేదాకా ప్రస్తుత ధర నిలకడగా ఉంటే పెట్టుబడి ఖర్చులైనా వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. అయితే, కొద్దిరోజుల్లో మార్కెట్‌కు అధిక మొత్తంలో పంట రానుండగా ప్రస్తుత ధర ఉంటుందో.. లేదోననే ఆందోళన రైతుల్లో మొదలైంది. ఈ ఏడాది మద్దతు ధర పెరగడంతో పాటు మార్కెట్‌లోనూ ధర మెరుగ్గా ఉండటం కొంత ఊరటనిస్తోందని రైతులు చెబుతున్నా దిగుబడి తగ్గడంతో నిరాశ చెందుతున్నారు. సోయాకు కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది కనీస మద్దతు ధర పెంచుతోంది. అధికారిక గణాంకాల ప్రకారం.. 2024–25లో క్వింటాల్‌కు రూ.4,892, 2025–26లో రూ.5,328, 2026–27లో రూ.5,708 మద్దతు ధర ఉంది. 2024–25తో పోలిస్తే ఈ సంవత్సరం క్వింటాల్‌పై రూ.816 పెరిగింది. 2025–26 నుంచి 2026–27కు ధర రూ.380 పెరిగింది.
దేవునిగూడెం అంగన్‌వాడీ నోటిఫికేషన్‌లో సవరణ
నిర్మల్‌చైన్‌గేట్: జిల్లాలోని దేవునిగూడెం అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో సవరణ చేసినట్లు జిల్లా మహిళా, శిశు, వికలాంగులు, వయోవృద్ధుల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సదరు నోటిఫికేషన్‌లో ఎస్టీ రిజర్వేషన్‌కు బదులు పొరపాటున ఈడబ్ల్యూఎస్ అని ప్రచురించినట్లు పేర్కొంది. పొరపాటును సరిచేస్తూ నోటిఫికేషన్‌లో తగిన సవరణలు చేసినట్లు తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్థులు గమనించి వచ్చే మూడురోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌తోపాటు జిల్లా స్థాయి సెలక్షన్ కమిటీ కోరింది.
భైంసా: సోయా రైతులకు ఈ ఏడాది ధర కాస్త ఊరటనిస్తోంది. కానీ, వర్షాభావ పరిస్థితులతో దిగుబడి సగానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లావ్యాప్తంగా సుమారు 74వేల ఎకరాల్లో రైతులు సోయా సాగు చేశారు. రెండ్రోజులుగా కోతలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం జిల్లాలోని ప్రైవేట్ మార్కెట్‌లో క్వింటాల్‌కు రూ.5,600 నుంచి రూ.6,100 వరకు ధర పలుకుతోంది. మద్దతు ధర కంటే కొన్ని మార్కెట్లలో ఎక్కువ ధర వస్తుండటంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా సరిహద్దుకు సమీపంలోని ధర్మాబాద్‌లో రూ.6,200 వరకు ధర లభిస్తోంది. అంతేకాకుండా రవాణా భారం కూడా తగ్గనుండడంతో జిల్లా సరిహద్దు ప్రాంత రైతులు అక్కడే పంట విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పెట్టుబడి ఖర్చులైనా వచ్చేనా?
మూడేళ్లలో మద్దతు ధర ఇలా..
సంవత్సరం మద్దతు ధర
2024–25 రూ.4,892
2025–26 రూ.5,328
2026–27 రూ.5,708
ఎల్‌నినో ప్రభావంతో..
ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో ఈసారి వర్షాభావ పరిస్థితులేర్పడ్డాయి. కీలక దశలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేక పంట ఎదుగుదలపై ప్రభావం పడింది. నేలలో తేమ తగ్గి మొక్కలు ఆశించిన స్థాయిలో ఎదగలేదు. కాయల సంఖ్య ఘననీయంగా తగ్గింది. ఎకరాకు 10–12 క్వింటాళ్ల వరకు రావాల్సి ఉండగా సగం దిగుబడే వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.


