బాసరలో సాంస్కృతిక కార్యక్రమాలకు బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

బాసరలో సాంస్కృతిక కార్యక్రమాలకు బ్రేక్‌

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

● వేదిక లేనందున అధికారుల నిర్ణయం ● 11నుంచి 20వరకు నవరాత్రోత్సవాలు

● అసంతృప్తిలో భక్తులు, కళాకారులు

భైంసా/బాసర: బాసరలో ఈ నెల 11నుంచి 20వరకు నిర్వహించనున్న నవరాత్రోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించకూడద ని ఆలయ అధికారులు నిర్ణయించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దేవస్థానం ప్రాంగణంలోని కొన్ని నిర్మాణాలు తొలగించే ప నులు ప్రస్తుతం కొనసాగుతున్నట్లు పేర్కొన్నా రు. ఆలయ ప్రాంగణంలో కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల కోసం సాధారణంగా ఉపయోగించే కలాక్షేప మండపాన్ని ఇప్పటికే తొలగించడంతో కార్యక్రమాలు నిర్వహించేందుకు అ నువైన ప్రత్యామ్నాయ వేదిక అందుబాటులో లే దని తెలిపారు. ఈ నేపథ్యంలో సాంస్కృతిక కా ర్యక్రమాలు నిర్వహించకూడదని నిర్ణయించిన ట్లు ఈవో అంజనాదేవి శుక్రవారం జారీ చేసిన ప్రకటనలో వెల్లడించారు. భక్తులు, కళాకారులు గమనించి సహకరించాలని కోరారు.

అధికారుల నిర్ణయంపై అసంతృప్తి

నవరాత్రోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించకూడదని అధికారులు నిర్ణయం తీసుకోవడంతో భక్తులు, కళాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదువుల తల్లి సన్నిధిలో తమ కళను ప్రదర్శించాలన్నది అనేక మంది కళాకారుల ఆకాంక్ష. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులు కూడా బాసర ఉత్సవాల్లో ప్రదర్శన ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వేదికపై తమ ప్రతిభను ప్రదర్శించడం తమకు ప్రత్యేక అనుభూతి అని వారు చెబుతున్నారు. కళాక్షేప మండపం తొలగించారన్న కారణంతో సాంస్కృతిక కార్యక్రమాలు పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం లేదని భక్తులూ పేర్కొంటున్నారు. బాసర ఆలయం–గోదావరి నది మధ్య విశాలమైన ప్రదేశం అందుబాటులో ఉందని చెబుతున్నారు. అక్కడ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తాత్కాలిక వేదిక ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించవచ్చని సూచిస్తున్నారు. దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వం ఈ విషయాన్ని మరోసారి పరిశీలించి సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ఇబ్బందులు రాకూడదనే..

ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. పునర్నిర్మాణంలో భాగంగా పాత మండపాలను కూల్చివేశాం. కళాకారులు బస చేయడానికి ప్రస్తుతం ఆలయ ప్రాంగణంలో ప్రత్యామ్నాయ భవనాలు లేవు. అందుకే ఈనెల 11నుంచి 20వరకు నిర్వహించాల్సిన నవరాత్రోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు రద్దు చేస్తున్నాం.

– అంజనాదేవి, బాసర ఆలయ ఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement