నిర్మల్: అధికార కాంగ్రెస్‌లో పదవుల పంచాయితీ ముదురుతోంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్), ఫార్మర్స్ సర్వీస్ కోఆపరేటివ్ సొసైటీల (ఎఫ్‌ఎస్‌సీఎస్) చైర్మన్ పదవుల వ్య వహారం పార్టీలో కొత్త చర్చకు తెరతీసింది. పదవులు ఆశిస్తున్న నాయకులు, వారి అనుచరులు ఎవరి కి వారు ప్రయత్నాలు ముమ్మరం చేస్తుండగా, మ రోవైపు తమకు పదవులు ఖరారైనట్లు ప్రచారం చే సుకోవడం పార్టీలో గందరగోళానికి దారితీసింది. అధికారిక ప్రకటన రాకుండానే పదవులు ఖరారయ్యాయంటూ ప్రచారం సాగుతుండగా డీసీసీ అ ధ్యక్షుడు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అసంతృప్తి వ్య క్తంచేశారు. ఇలాంటి ప్రచారాలు చేయవద్దంటూ వీ డియో ద్వారా పార్టీ శ్రేణులకు సూచించారు. మరో వైపు డైరెక్టర్లు, చైర్మన్లుగా ఎవరుండాలనేది ఫైనలైందని, కమిషనర్ నుంచి అధికారిక ఉత్తర్వులు రావడమే ఆలస్యమని సీనియర్ నేతలు చెబుతున్నారు.
నామినేటెడ్ కావడంతో..
జిల్లాలో 16పీఏసీఎస్‌లు, నిర్మల్‌లో ఒక ఎఫ్‌ఎస్‌సీ ఎస్ ఉన్నాయి. ఒక్కో సంఘంలో 13మంది డైరెక్టర్లుంటారు. ఇందులో నుంచే ఒకరిని చైర్మన్, మరొకరిని వైస్ చైర్మన్‌గా ఎన్నుకుంటారు. 2020వరకు ఈ సంఘాలకు ఎన్నికల ద్వారానే పాలకవర్గాలను ఎ న్నుకున్నారు. ఆయా సంఘాల్లోనే సభ్యులు ఈ డైరెక్టర్లను ఎన్నుకుంటే, వారు తమలో నుంచి ఇద్దరిని చైర్మన్, వైస్‌చైర్మన్‌గా ఎన్నుకునేవారు. ఐదేళ్ల కాలపరిమితితో ఈ పాలకవర్గం కొనసాగేది. కానీ.. 2025 లో కాలపరిమితి ముగిసిన తర్వాత ఎన్నికలు నిర్వహించకుండా అవే పాలకవర్గాలను ఆరునెలల పా టు పొడిగిస్తూ, పాత చైర్మన్లకే పర్సన్ ఇన్‌చార్జి (పీఐసీ) బాధ్యతలిచ్చారు. ఆరునెలల తర్వాత అధికా రులకు పీఐసీ బాధ్యతలు అప్పగించగా, పాత పాలకవర్గాలు కోర్టుకు వెళ్లాయి. కోర్టు ఆదేశాల మేరకు మళ్లీ పాత వారినే పీఐసీలుగా ప్రకటించారు. ఈసా రి ఎన్నికలు కాకుండా నామినేటెడ్ విధానంలో ఎంపిక చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించడం జిల్లాలో పదవులపై ఆశలతోపాటు పోటీ పెరిగింది.
ఖండించిన డీసీసీ అధ్యక్షుడు
సహకార సంఘాల పదవులు ప్రకటించినట్లు సోష ల్ మీడియాలో చేసిన ప్రచారంపై పలువురు డీసీసీ అధ్యక్షుడు బొజ్జు పటేల్‌కు ఫిర్యాదు చేయగా, ఆయ న సీరియస్ అయ్యారు. వెంటనే ఓ వీడియో ద్వారా తన ప్రకటనను పార్టీ శ్రేణులకు విడుదల చేశారు. పదవులపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఇప్పటివరకు ఇంకా అధికారికంగా ఫైనల్ కాలేదని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ముందుగా ప్రచారం చేయవద్దని ఆయన స్పష్టంచేశారు.
ఎవరికి వారే ప్రచారం
కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నుంచీ ఇప్పటివరకు నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి పదవులు దక్కలేదు. అసంతృప్తితో ఉన్న క్యాడర్‌లో సహకార సంఘాల పదవులతో కాస్త సంతృప్తి నింపేందుకు సర్కారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జిల్లాలో సహకార సంఘాల చైర్మన్ పదవుల కోసం చాలామంది నాయకులు ఆశలు పెట్టుకున్నారు. తమకు పార్టీ పెద్దల నుంచి హామీ లభించిందని, తమకే పదవి ఖరారైందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. అధికారికంగా తేలకముందే ఎలా ప్రచారం చేసుకుంటారంటూ వీటిపై మిగతా నాయకులు పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు.


