ఘనంగా ‘శాస్త్రి’ జయంతి | - | Sakshi
Sakshi News home page

ఘనంగా ‘శాస్త్రి’ జయంతి

Oct 2 2026 11:50 PM | Updated on Oct 2 2026 11:50 PM

నిర్మల్‌చైన్‌గేట్‌: నిర్మల్‌ పట్టణంలోని ఇంద్రానగర్‌లోగల బీజేపీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన అందించిన సేవలు, జై జవాన్‌–జై కిసాన్‌ నినాదం ద్వారా సాధించిన స్ఫూర్తిని నాయకులు స్మరించుకున్నారు. పార్టీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు డాక్టర్‌ దాసరి పోశెట్టి, నాయకులు అడేపు సుధాకర్‌, పంతేకే ప్రకాశ్‌, రావుల రాము, రచ్చ మల్లేశ్‌, ద్యాగ ప్రకాశ్‌, తోట సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement