వృద్ధుల సేవలకు రాష్ట్రస్థాయి పురస్కారం | - | Sakshi
Sakshi News home page

వృద్ధుల సేవలకు రాష్ట్రస్థాయి పురస్కారం

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

నిర్మల్‌టౌన్‌: వయోవృద్ధుల సంక్షేమం, వైద్య సేవలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో అందించిన సేవలకు గుర్తింపుగా నిర్మల్‌కు చెందిన ప్రముఖ ఆయుర్వేద, న్యూరోథెరపిస్ట్‌ డాక్టర్‌ ఉమేష్‌ గుప్తాకు రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. అంతర్జాతీయ వయోవృద్ధుల ది నోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. 32 ఏళ్లుగా వైద్యరంగంలో సేవలందిస్తున్న ఉమేష్‌ గుప్తా.. వృద్ధులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అందుబాటులో వైద్య సేవలు అందించడంపై ప్రత్యే క శ్రద్ధ చూపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి ఉమేశ్‌గుప్తా కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement