నిర్మల్‌చైన్‌గేట్: క్రిటికల్ కేర్ సెంటర్‌పై మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తప్పుడు ప్రచారం మానుకోవాలని బీజేపీ నాయకులు సూచించారు. క్రిటికల్ కేర్ కేంద్రాన్ని గురువారం బీజేపీ నాయకులు సందర్శించారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన ఇంద్రకరణ్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. కేంద్రం నిధులు రూ.23.74 కోట్లతో ఈ అత్యాధునిక క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మించినట్లు తెలిపారు. ఏలేటి గెలిచిన వెంటనే ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ భవన నిర్మాణ పనులు వేగవంతం చేయించడమే కాకుండా, దీనిని 100 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయించారని పేర్కొన్నారు. రూ.10 కోట్ల విలువైన వైద్య పరికరాలు, ఫర్నిచర్, ఇతర మౌలిక వసతులను సమకూర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరికరాలు, ఫర్నిచర్ సమకూర్చి, సిబ్బందిని కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇందులో నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మె రాజు, సాదం అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, కౌన్సిలర్లు గంజి రాజు, నరేశ్, విఠల్, జింక సురేందర్, సూరజ్‌నాయక్, కూన శశాంక్, అర్జున్, ఈశ్వర్, మండల అధ్యక్షుడు మార గంగారెడ్డి, సర్పంచులు గంగారెడ్డి, సాహెబ్‌రావు పాల్గొన్నారు.


