కనుల పండువగా కర్ర వినాయకుల నిమజ్జనం | - | Sakshi
Sakshi News home page

కనుల పండువగా కర్ర వినాయకుల నిమజ్జనం

Sep 26 2026 12:32 AM | Updated on Sep 26 2026 12:32 AM

తానూరు : మండలంలోని భోసి గ్రామంలో 11 రోజులుగా విశేష పూజలందుకున్న కర్ర గణనాథుడి నిమజ్జన వేడుకలు శుక్రవారం కన్నులపండువగా నిర్వహించారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు కర్ర వినాయకునికి ప్రత్యేక పూజలు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. చివరి రోజు దర్శనం కోసం తెలంగాణతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో భోసి జనసంద్రంగా మారింది. కర్ర వినాయకుని లడ్డూను రూ.71 వేలకు గ్రామానికి చెందిన పసుల భోజన్న సొంతం చేసుకున్నారు. గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం బావి సమీపానికి తీసుకెళ్లి నీళ్లు చల్లి, ప్రత్యేకంగా తయారుచేసిన బీరువాలో కర్ర వినాయకుని భద్రపరిచారు.

బ్యాండు మేళాలు.. తీన్మార్‌ స్టెప్పులు

గణేశ్‌ మండలి వద్ద బ్యాండు మేళాలు ప్రతిధ్వనించాయి. యువకులు తీన్మార్‌ స్టెప్పులు వేసి వేడుకలకు శోభను తెచ్చారు. ఎటు చూసినా బ్యాండు మేళాల చప్పుళ్లే వినిపించాయి. శోభాయాత్ర పొడవునా ప్రధాన వీధుల్లో మహిళలు మంగళహారతులు ఇచ్చి అక్షింతలు చల్లి దీవించాలని వేడుకున్నా రు. అందరినీ చల్లగా కాపాడి ఆరోగ్యంగా ఉంచి మంచి పంటలు పండాలని కోరుకున్నారు. భైంసా మున్సిపల్‌ చైర్మన్‌ దత్తాత్రి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ ఉత్తం బాలేరావ్‌, వీడీసీ అధ్యక్షులు బాలా జీ, నాయకులు నాగనాథ్‌, ఉపసర్పంచ్‌ లక్ష్మణ్‌ పాల్గొన్నారు.

భైంసారూరల్‌: మండలంలోని మాటేగాం గ్రామంలో భక్తిశ్రద్ధలతో కొరడి గణేశుని నిమజ్జనం శుక్రవారం నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు మాటేగాం గ్రామానికి తరలివెళ్లారు. ఆలయంలో పూజలు చేశారు, తర్వాత శోభయాత్రలో పాల్గొన్నారు. శోభయాత్ర అనంతరం కొరడి గణేశునిపై నీళ్లు చల్లి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బీరువాలో భద్రపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement