పాఠశాల విద్యతో ఏటీఎల్‌ అనుసంధానం | - | Sakshi
Sakshi News home page

పాఠశాల విద్యతో ఏటీఎల్‌ అనుసంధానం

Sep 26 2026 12:32 AM | Updated on Sep 26 2026 12:32 AM

ఉపాధ్యాయులకు మూడు రోజులు శిక్షణ

నిర్మల్‌ రూరల్‌: విద్యార్థుల్లో సృజనాత్మకత, శాసీ్త్రయ ఆలోచన, ప్రయోగాత్మక అభ్యాసం, సమస్య పరి ష్కార నైపుణ్యాలను పెంపొందించేందుకు అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌ (ఏటీఎల్‌)ను పాఠశాల విద్యతో అనుసంధానం చేయాలనే లక్ష్యంతో జిల్లాలోని ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు హైదరాబాద్‌లో మూ డు రోజుల శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 24 నుంచి 26 వరకు జిల్లాలోని 18 పాఠశాలల నుంచి 18 మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉపయోగపడే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచ యం చేయడంతోపాటు, ఉపాధ్యాయులు స్వయంగా ప్రయోగాలు చేసి వాటిని సులభంగా బోధించేందుకు అవసరమైన నైపుణ్యాలను అందించడం ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశం. శిక్షణలో భాగంగా ప్రాథమిక ఎలక్ట్రానిక్స్‌, బేసిక్‌ ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్లు, సిరీస్‌, ప్యారలల్‌ సర్క్యూట్లు వంటి అంశాలను ప్రయోగా త్మకంగా వివరించారు. ప్రయోగాలను భౌతికంగా రూపొందించే ముందు వాటిని డిజిటల్‌గా పరీక్షించే పద్ధతులపైనా శిక్షకులు అవగాహన కల్పించారు. కోడింగ్‌తోపాటు ఏఐ సంబంధిత ప్రాథమిక అంశాలపై కూడా శిక్షణ ఇస్తున్నారు. జిల్లా సైన్స్‌ అధికారి వినోద్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తోంది. విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం, సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement