మార్మోగిన వందేమాతరం | - | Sakshi
Sakshi News home page

మార్మోగిన వందేమాతరం

Sep 26 2026 12:32 AM | Updated on Sep 26 2026 12:32 AM

భైంసాటౌన్‌: వందేమాతరం గేయ రచన జరిగి 150 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విద్యాభారతి అఖి ల భారతీయ శిక్షాసంస్థాన్‌ ఆధ్వర్యంలో ‘నమామి భారతం–వందేమాతరం సామూహిక గానం’ శుక్రవారం భైంసాలో చేపట్టారు. పట్టణంలోని ఎస్‌ఎస్‌ కాటన్‌ జిన్నింగ్‌ ఫ్యాక్టరీలో పాఠశాలల విద్యార్థులతో కలిసి వందేమాతరం సామూహికంగా ఆలపించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల నుంచి 2,150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పి.రామారావు పటేల్‌, మున్సిపల్‌ చైర్మన్‌ తూముల దత్తాత్రి, ప్రధాన వక్త నర్రా వెంకటశివకుమార్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులతో కలిసి వందేమాతరం ఆలపించారు. అంతకుముందు జాతీయజెండా ఆవిష్కరించారు. అనంతరం జాతీయగీతం ఆలపించారు. కార్యక్రమంలో సరస్వతి విద్యాపీఠం ఆదిలాబాద్‌ విభాగ్‌ కార్యదర్శి సరికొండ దామోదర్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ ఇందూరు విభా గ్‌ ప్రచారక్‌, జిల్లా సహ సంఘచాలక్‌ కృష్ణదాస్‌, సరస్వతి శిశుమందిర్‌ పాఠశాలల అధ్యక్షులు, ప్రబంధకారిణి సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement