లింగాపూర్: ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అఆగ్ని ప్రమాదంలో కంచన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధి మూలగూడ గ్రామానికి చెందిన చిన్నారి మృతి చెందగా బాధిత దుర్గాబాయి–మారుతి దంపతులను ఐటీడీఏ పీవో మంద మకరందు శుక్రవారం పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంజూరైన రూ.5లక్షల చెక్కు అందించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అవసరమైన స హాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం చ ర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏవో సంజ య్‌కుమార్, ఏపీవో పీవీటీవీ ఆత్రం భాస్కర్, హౌ సింగ్ ఏఈ శశికాంత్, సర్పంచ్ ఆత్రం శేషునారాయణ, కనక పార్వతీబాయి, అధి కారులు పాల్గొన్నారు.


