వియత్నాం పర్యటనకు హెచ్‌ఎం ఎంపిక | - | Sakshi
Sakshi News home page

వియత్నాం పర్యటనకు హెచ్‌ఎం ఎంపిక

Sep 26 2026 12:32 AM | Updated on Sep 26 2026 12:32 AM

సాత్నాల: విద్యార్థుల సంఖ్య, విద్యాప్రమాణా ల పెంపు, పాఠశాల, వి ద్యార్థుల సమగ్రాభివృద్ధి కి అనేక కార్యక్రమాలు చే పట్టిన భోరజ్‌ మండలం పిప్పర్‌వాడ జిల్లా పరిషత్‌ ప్రాథమిక పాఠశా ల ప్రధానోపాధ్యాయురాలు గడ్డం శశికళ వి యత్నాం పర్యటనకు ఎంపికయ్యారు. ఆమె ను ఎంపిక చేస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ హైదరాబాద్‌ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పర్యటనలో భాగంగా ఆమె వియత్నాం దేశంలో అమలవుతున్న విద్యా విధానం, ఆధునిక బోధనా పద్ధతులపై అధ్యయనం చేయనున్నారు. ఆమె ఎంపికపై తోటి ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఆమె ఎంపిక మండలంలోని మరింతమంది ఉపాధ్యాయులకు స్ఫూర్తినిస్తుందని విద్యావేత్తలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement