రిమ్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ఫెలోషిప్‌లో సీటు | - | Sakshi
Sakshi News home page

రిమ్స్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు ఫెలోషిప్‌లో సీటు

Sep 26 2026 12:32 AM | Updated on Sep 26 2026 12:32 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఆదిలాబాద్‌ రిమ్స్‌ మెడికల్‌ కళాశాల ఆర్థోపెడిక్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ మామిడి శరత్‌రావుకు ఢిల్లీలోని ఇండియన్‌ స్పైనల్‌ ఇంజురీస్‌ సెంటర్‌ (ఐఎస్‌ఐసీ)లో స్పైన్‌ సర్జరీ ఫెలోషిప్‌లో సీటు లభించింది. దేశ వ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన స్పైన్‌ వైద్య సంస్థల్లో ఒకటైన ఐఎస్‌ఐసీలో ఈ అవకాశం దక్కడం విశేషమని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. 2025లో నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ నిర్వహించిన ఎఫ్‌ఎన్‌బీ (ఫెలోషిప్‌ ఇన్‌ నేషనల్‌ బోర్డ్‌) ప్రవేశ పరీక్షలో డాక్టర్‌ శరత్‌రావు జాతీయ స్థాయిలో 44వ ర్యాంక్‌ సాధించారు. ఈ ప్రతిభ ఆధారంగా రెండేళ్ల పాటు కొనసాగే స్పైన్‌ సర్జరీ ఫెలోషిప్‌ కోర్సుకు ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ఢిల్లీలోని ఐఎస్‌ఐసీలో ఫెలోషిప్‌ సీటు సాధించడం ఆనందంగా ఉందని డాక్టర్‌ శరత్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తల్లిదండ్రులు ఆంజనేయులు, వసంతతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు, రిమ్స్‌ వైద్యులు, అధికారులు అభినందనలు తెలిపారు.

పాపహరేశ్వరాలయంలో అనంత చతుర్దశి వేడుకలు

దిలావర్‌పూర్‌: మండలంలోని కదిలి మాతాన్నపూర్ణేశ్వరీ పాపహరేశ్వరాలయంలో శుక్రవారం నర్సాపూర్‌(జి) మండలం గొల్లమాడ గురుదత్త ఆశ్రమ భక్తులు అనంత చతుర్థశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనేక మంది భక్తులు కంకణధారణ చేసి ఆలయ ప్రాంగణంలో చేపట్టిన అన్న ప్రసాద వితరణలో ఉపవాస దీక్షలు విరమించారు. 14 ముడులతో కూడిన కంకణధారణం ఆనవాయితీగా వస్తోందని వెల్ల డించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ నార్వాడి వెంకట్రావు పాటిల్‌, ధర్మకర్తలు సింధే ధత్తురాం పాటిల్‌, మాడేగం గ్రామ సర్పంచ్‌ జాదవ్‌ మారుతీ రావు పాటిల్‌, మాజీ చైర్మన్‌లు నార్వాడి సంభాజీ రావు పాటిల్‌, భుజంగ్‌రావు పాటిల్‌, దేవాదాయ శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ జాదవ్‌ మాధవరావు పాటిల్‌, వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement