సారంగపూర్: మండలంలోని ఆయా గ్రామాల్లో గల తెల్ల కల్లు దుకాణాలు, వైన్ షాపులు, దాబా హోటళ్లను శుక్రవారం ఎకై ్సజ్, పోలీస్ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎకై ్సజ్ ఎస్సై వసంత్‌రావు, స్థానిక ఎస్సై శ్రీకాంత్ మాట్లాడారు. శని, ఆదివారాల్లో ప లు గ్రామాల్లో గణపతి నిమజ్జన శోభా యా త్ర జరగనున్న నేపథ్యంలో ముందస్తుగా వీ టిని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా, ఎవరైనా మద్యం విక్రయించినట్లు తమ దృష్టికి వస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ఎకై ్సజ్, పోలీస్‌శాఖల సిబ్బంది ఉన్నారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి
గుడిహత్నూర్: మండల కేంద్రంలోని జవహర్‌నగర్ సమీపంలో జాతీయ రహదారి 44పై గురువా రం రాత్రి జరిగిన ప్రమాదంలో బజార్‌హత్నూర్ మండలం హర్కాయి గ్రామానికి చెందిన హిరకుమ్ర పాండు (32) మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరా ల ప్రకారం.. హిరకుమ్ర పాండు గురువారం రాత్రి 8గంటల ప్రాంతంలో జాతీయ రహదా రి దాటుతుండగా స్థానిక జవహర్‌నగర్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తల కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థా నికులు వెంటనే అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అయినా, రాత్రి 10గంటల సమయంలో పాండు చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎల్.శ్రీకాంత్ తెలిపారు.
పాము కాటుతో రైతు..
లక్ష్మణచాంద: పాము కాటుకు గురై రైతు మృతి చెందిన ఘటన మండలంలోని చామన్‌పెల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన కుంటాల పోశెట్టి (51) శుక్రవారం తన పొలానికి వెళ్లాడు. అక్కడ పాము కాటు వేసింది. ఏదో పురు గు కాటువేసినట్లు భావించిన పోశెట్టి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. వెంటనే వారు పోశెట్టిని నిర్మల్ ఏరియాస్పత్రికి త రలించే క్రమంలో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లాక వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని తెలిపారు. పోశెట్టికి భార్య ముత్తవ్వ, కుమారుడు నవీన్, కుమార్తె ఉన్నారు.
గుండెపోటుతో
అంగన్‌వాడీ హెల్పర్..
తాంసి: భీంపూర్ మండలం ఇందూర్‌పల్లి గ్రా మానికి చెందిన అంగన్‌వాడీ హెల్పర్ అనుసూయ(38) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందింది. గురువారం సాయంత్రం ఇంటి వద్ద పనులు చేస్తుండగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయింది. ఆమె మృతి పట్ల గ్రామ సర్పంచ్ సురేఖ సంతాపం వ్యక్తం చేశారు.


