ఆదిలాబాద్‌టౌన్: రిమ్స్‌లో ప్రాణాలు కోల్పోయిన శిశువుల కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రిమ్స్‌ను సందర్శించారు. ఎస్‌ఎన్‌సీయూ వార్డుతో పాటు ఆస్పత్రిలోని పలు విభాగాలను పరిశీలించి రోగుల ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులు తమ సమస్యలపై వినతి పత్రాలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రిమ్స్‌లో నిర్వహణ, పర్యవేక్షణ లోపం కారణంగానే అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఆయన వెంట పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేశ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రవికుమార్, రవి, సచిన్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశాలత, రాఘవులు, కిరణ్ తదితరులున్నారు.
నిర్వాసితులకు అన్యాయం
జరిగితే చూస్తూ ఊరుకోబోం..
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు అన్యాయం జ రిగితే చూస్తూ ఊరుకోబోమని జాన్ వెస్లీ స్ప ష్టం చేశారు. ఎయిర్‌పోర్టు కోసం భూములు సేకరించనున్న అనుకుంట గ్రామాన్ని శుక్రవా రం సందర్శించారు. గ్రామస్తులు, నిర్వాసిత రైతులతో సమావేశమై ప్రభుత్వ భూసేకరణ విషయంలో వారికున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయశ్రయ భూ సేకరణలో తమ సాగు భూములను కోల్పోతున్న రైతుల ను పూర్తి స్తాయిలో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఎకరాకు రూ. 6కో ట్ల పరిహారంతో పాటు పునరావాసం, పునర్నిర్మాణం కల్పించాలని డిమాండ్ చేశారు.


