వలస కార్మికుల సంక్షేమానికి ముందడుగు | - | Sakshi
Sakshi News home page

వలస కార్మికుల సంక్షేమానికి ముందడుగు

Sep 26 2026 12:32 AM | Updated on Sep 26 2026 12:32 AM

నిర్మల్‌ఖిల్లా: తెలంగాణతోపాటు భారతీయ వలస కార్మికుల హక్కులు, రక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ గల్ఫ్‌ సమితి–ఖతార్‌, ప్రవాసీమిత్ర కార్మిక సంఘం–తెలంగాణ సంయుక్తంగా పనిచేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు శుక్రవారం డిజిటల్‌ వర్చువల్‌ వేదికగా రెండు సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. బిల్డింగ్‌ అండ్‌ వుడ్‌ వర్కర్స్‌ ఇంటర్నేషనల్‌కు అనుబంధంగా పనిచేస్తున్న ఈ రెండు కార్మిక సంఘాలు సురక్షిత, క్రమబద్ధమైన, చట్టబద్ధమైన వలసలను ప్రోత్సహించడంతోపాటు వలస కార్మికుల సమస్యలను క్షేత్రస్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయనున్నాయి. ఈ డిజిటల్‌ అవగాహన ఒప్పందంపై ప్రవాసీ మిత్ర కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్‌ పరికిపండ్ల, తెలంగాణ గల్ఫ్‌ సమితి–ఖతార్‌ అధ్యక్షుడు మధు మైదం సంతకాలు చేశారు. ఈ మేరకు ప్రవాసీమిత్ర లేబర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు నిర్మల్‌ జిల్లాకు చెందిన స్వదేశ్‌ వివరాలు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి విరివిగా విదేశీ ఉపాధి కోసం వెళ్తున్న కార్మికులకు వీసా, ఉద్యోగ ఒప్పందం, వేతనాలు, నియామక ప్రక్రియ, పని పరిస్థితులు, కార్మికుల హక్కులు, చట్టపరమైన అంశాలపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వదేశానికి తిరిగి వచ్చిన కార్మికులకు పునరావాసం, పునఃసమీకరణ, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు తదితర అంశాలపై సమాచారం, మార్గదర్శకత్వం అందించే కార్యక్రమాలూ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వలస కార్మికులు సమస్యలు సేకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement