నిండుకుండలా ‘ఎల్లంపల్లి’ | - | Sakshi
Sakshi News home page

నిండుకుండలా ‘ఎల్లంపల్లి’

Sep 26 2026 12:32 AM | Updated on Sep 26 2026 12:32 AM

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుని జలకళను సంతరించుకుంది. శుక్రవారం ప్రాజెక్ట్‌ నీటి మట్టం వివరాలు ఇలా ఉన్నాయి. 148 మీటర్ల క్రస్ట్‌ లెవెల్‌కు 148 మీటర్లు చేరగా.. 20.175 టీఎంసీలకు గాను 20.100 టీఎంసీల నీటి మట్టంతో నిండుకుండను తలపిస్తోంది. ఇన్‌ఫ్లో కింద ఎగువ ప్రాంతాల నుంచి 13వేల క్యూసెక్కుల వరదనీరు ప్రాజెక్ట్‌లోకి వచ్చి చేరుతుండగా.. అవుట్‌ ఫ్లో కింద హైదరాబాద్‌కు 277, ఎన్టీపీసీకి 121, నంది పంప్‌హౌస్‌కు 12,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.

‘కడెం’కు స్వల్ప ఇన్‌ఫ్లో

కడెం: కడెం ప్రాజెక్ట్‌కు శుక్రవారం 1,242 క్యూసెక్కుల స్వల్ప ఇన్‌ఫ్లో వస్తున్నట్లు ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement