కపిల్‌కు విశిష్ట సాహిత్య పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

కపిల్‌కు విశిష్ట సాహిత్య పురస్కారాలు

Sep 26 2026 12:32 AM | Updated on Sep 26 2026 12:32 AM

ఉట్నూర్‌రూరల్‌: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల తె లుగు అధ్యాపకుడు, యువ కవి కపిల్‌ను వరుస సాహిత్య పురస్కారాలు వరించాయని కళాశాల అ ధ్యాపకులు పేర్కొన్నారు. ఇటీవల వివిధ సాహితీ సంస్థలు నిర్వహించిన రాష్ట్ర, జాతీయ స్థాయి కవి తల పోటీల్లో ప్రతిభ చాటి ఆయన ఈ పురస్కారా లు అందుకున్నట్లు తెలిపారు. తెలుగు కళారత్నాలు, ఉషోదయ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో గుర్రం జాషువా జయంతి సందర్భంగా రాసిన కవితకు ప్రథమ విజేతగా నిలిచి గు ర్రం జాషువా సేవా సౌరభం బిరుదు పొందారు. అ లాగే, డాక్టర్‌ బోయి భీమన్న జయంతి పోటీల్లో డా క్టర్‌ బోయి భీమన్న చైతన్య దీప్తి బిరుదు సాధించారు. వీటితో పాటు ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ గ్లోబల్లీ యు నైటెడ్‌ టీచర్స్‌ నిర్వహించిన పోటీల్లో ప్రత్యేక ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా కళా శాల ప్రిన్సిపాల్‌ టి.ప్రతాప్‌ సింగ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ సాయిప్రసాద్‌, సంస్థ ప్రతినిధులు శుక్రవారం ఆయనను అభినందిస్తూ.. కపిల్‌ సాధించిన పురస్కారాలు కళాశాలకే గర్వకారణమని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement