‘యువ టూరిజం క్లబ్‌’ జిల్లాస్థాయి పోటీలు | - | Sakshi
Sakshi News home page

‘యువ టూరిజం క్లబ్‌’ జిల్లాస్థాయి పోటీలు

Sep 23 2026 12:07 AM | Updated on Sep 23 2026 12:07 AM

నిర్మల్‌ రూరల్‌/దస్తురాబాద్‌: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు జిల్లా కేంద్రంలోని సోఫీ నగర్‌ గురుకుల పాఠశాలలో యువ టూరిజం క్లబ్‌ జిల్లాస్థాయి పోటీలు మంగళవారం నిర్వహించారు. డ్యాన్స్‌ విభాగంలో 9 గ్రూపులు, డ్రాయింగ్‌ విభాగంలో 9 గ్రూపులు పాల్గొన్నాయి. గెలుపొందిన మొదటి మూడు గ్రూపులను హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌ డానియల్‌, జిల్లా పంచాయతీ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, అసిస్టెంట్‌ నోడల్‌ ఆఫీసర్‌ సాయికృష్ణ , జిల్లా సైన్స్‌ అధికారి వినోద్‌ కుమార్‌, సెక్టోరల్‌ అధికారి రమాదేవి పాల్గొన్నారు.

డాన్స్‌ విభాగంలో విజేతలు

● మొదటి బహుమతి(కేజీబీవీ తానూర్‌)

● రెండో బహుమతి(జెడ్పీహెచ్‌ఎస్‌, దస్తురాబాద్‌)

● మూడో బహుమతి(జెడ్పీహెచ్‌ఎస్‌, పాత

ఎల్లాపూర్‌)

డ్రాయింగ్‌ విభాగంలో..

● మొదటి బహుమతి(శ్రీహితి, జెడ్పీహెచ్‌ఎస్‌ మస్కాపూర్‌)

● రెండో బహుమతి(ఎం.మనోజ్ఞ, జెడ్పీహెచ్‌ఎస్‌ గుండంపల్లి)

● మూడో బహుమతి(జే.పూజ, జెడ్పీహెచ్‌ఎస్‌ కడ్తాల్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement