చట్టాలపై అవగాహన పెంచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

Sep 23 2026 12:07 AM | Updated on Sep 23 2026 12:07 AM

నిర్మల్‌టౌన్‌: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి పి.రవీందర్‌ అన్నా రు. లయన్స్‌క్లబ్‌ నిర్మల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా ఇంపాక్ట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా మంగళవారం స్థానిక సాగర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహించిన న్యాయ అవగాహన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. డ్రగ్స్‌ వినియోగంతో కలిగే నష్టాలు, ర్యాగింగ్‌ నిరోధక చట్టం, పోక్సో చట్టం తదితర అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం మోటివేషన్‌ స్పీకర్‌ గంప నాగేశ్వరరావు, సుధీర్‌ సండ్రా, శ్రీపాదరాం, సునీల్‌ కుమార్‌, రమేష్‌ తదితరులు కెరీర్‌ గైడెన్స్‌, పర్సనాలిటీ డెవలప్మెంట్‌, స్కిల్స్‌ పెంపు, ఒత్తిడి నిర్వహణ, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఏఐ టెక్‌ నిపుణుడు నిఖిల్‌ గుండా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికత భవిష్యత్తులో దాని అవకాశాలపై ప్రత్యేకంగా వివరించారు. కార్యక్రమంలో లయన్స్‌ క్లబ్‌ నిర్మల్‌ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, ప్రోగ్రాం చైర్మన్‌ ముత్యంరెడ్డి, అసిస్టెంట్‌ లీగల్‌ ఎయిడ్‌ లింగాగౌడ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement