సారంగపూర్: మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు శిఖం భూములతోపాటు ప్రాజెక్టు దిగువన గల భూములు, అప్పట్లో సిబ్బంది నివాసం ఉండేందుకు కేటాయించిన భూములను గ్రామానికి చెందిన పలువురు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతన్నారు. దీనిపై గ్రామస్తులు రెండు వారాలుగా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ భవేశ్‌మిశ్రా ఆదేశాల మేరకు అధికారులు స్పందించి మంగళవారం సర్వే పనులు ప్రారంభించారు. శిఖం భూముల గుర్తింపు కోసం మండలంలోని కుప్టి, పొట్య గ్రామాల నుంచి సర్వే ప్రారంభించారు. శిఖం భూములను గుర్తించిన అనంతరం హద్దులు ఏర్పాటు చేయనున్నట్లు ఎంసీ యోహాన్, తహశీల్దార్ విజయ్‌కాంత్‌రావు తెలిపారు. అనంతరం ప్రాజెక్టు దిగువన గల భూములతోపాటు సిబ్బంది నివసించేందుకు, అధికారులు నివశించేందుకు నిర్మించిన క్వార్టర్ల స్థానంలో నిర్మించిన ప్రతీ నిర్మాణం గుర్తిస్తామని తెలిపారు. వెంటనే నిర్మాణ పనులను నిలిపివేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, సర్వేయర్లు నరేందర్, సర్వే టీమ్ సభ్యులు పాల్గొన్నారు.


