బాల్య వివాహం నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహం నిలిపివేత

Sep 21 2026 6:53 AM | Updated on Sep 21 2026 6:53 AM

నర్సాపూర్‌(జి): మండలంలోని చాక్‌పల్లి గ్రామంలో బాల్య వివాహం జరగనున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. జిల్లా బాలల సంరక్షణ విభాగం, ఐసీడీఎస్‌, పోలీసు, పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఆదివారం గ్రామానికి వెళ్లారు. జరగబోయే బాల్య వివాహాన్ని అడ్డుకున్నారు. భైంసా పట్టణానికి చెందిన బాలికను(16), చాక్‌పల్లి గ్రామానికి చెందిన యువకుడితో వివాహం నిశ్చయించారు. అమ్మమ్మ ఇంట్లో ఆదివారం వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో అందిన సమాచారం మేరకు బాలల సంరక్షణ అధికారి రాజు, ఎస్సై గణేశ్‌, ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్‌ లక్ష్మీవిశారద అక్కడకు చేరుకున్నారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ చేశారు. బాల్య వివాహం చేస్తే ఎదుర్కొనే పరిణామాలు తెలిపారు. దీంతో తమ తప్పును గ్రహించిన బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తెకు 18 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేస్తామని లిఖితపూర్వకంగా డిక్లరేషన్‌ అందజేశారు. కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి రాజు, లీగల్‌ అడ్వైజర్‌ షేర్‌ నరేందర్‌, సర్పంచ్‌ మ్యాదరి సుధాకర్‌, పంచాయతీ కార్యదర్శి నరేశ్‌కుమార్‌, అంగన్వాడీ టీచర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement