భైంసా పట్టణంలో మంగళవారం నిర్వహించే వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలకు రావాలని గణేశ్‌నగర్ మున్నూరుకాపు సంఘం నాయకులు ఎస్పీ జానకీషర్మిలను కోరారు. ఈ మేరకు ముధోల్‌లో ఆమెను కలిసి ఆహ్వానించారు. ఏటా నిమజ్జనం రోజున గణేశ్ నగర్‌లోని మున్నూరుకాపు సంఘ భవనంలో హారతి పూజ అనంతరం శోభాయాత్ర ప్రారంభమవుతుందని, ఈసారి సైతం పూజా కార్యక్రమానికి హాజరై శోభాయాత్ర ప్రారంభించాలని ఎస్పీని కోరినట్లు సంఘ అధ్యక్షుడు తోట రాము తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నారాయణ, పెరుగు నవీన్, తోటరాజు పాల్గొన్నారు.


