‘పుష్కర’ పనులు గడువులోపు పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘పుష్కర’ పనులు గడువులోపు పూర్తి చేయాలి

Sep 19 2026 8:32 AM | Updated on Sep 19 2026 8:32 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ● బాసరలో అధికారులతో సమావేశం

బాసర: గోదావరి పుష్కరాల పనులన్నీ గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా ఆదేశించారు. శుక్రవారం బాసర ఆలయ ఈవో కార్యాలయంలో గోదావరి పుష్కరాల పనులపై అధికారులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. పుష్కరాల కు బాసరకు వచ్చే భక్తుల రద్దీకి తగినట్లు ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాధారణ భక్తులు, వీఐ పీ, వీవీఐపీ భక్తులకు ప్రత్యేక పార్కింగ్‌ సౌకర్యం క ల్పించాలని తెలిపారు. పుష్కరాల నిర్వహణ, భక్తు ల రద్దీ, సంఖ్య లెక్కింపు అంశాల్లో కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని సూచించారు. పనులను ఇంజినీరింగ్‌ అధికారులు నిరంతరం పర్యవేక్షించి నాణ్యత లోపించకుండా చూడాలని తెలిపారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. భక్తుల రద్దీకి తగినట్లు రవాణా సౌకర్యం కల్పించాలని, పార్కింగ్‌, ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని, సరిపడా మరుగుదొడ్లు నిర్మించాలని, తాగునీటి వసతి కల్పించాలని సూచించారు. అనంతరం హెలిప్యాడ్‌ నిర్మించనున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఆయన వెంట భైంసా సబ్‌ కలెక్టర్‌ అజ్మీరా సంకేత్‌కుమార్‌, విద్యుత్‌ ఎస్‌ఈ రమేశ్‌, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, నీటిపారుదల శాఖల ఈఈలు సుభాష్‌, సందీప్‌, అనిల్‌, ఆలయ ఈవో అంజనాదేవి, తహసీల్దార్‌ పవన్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement