టీటీడీ 100 గదుల వెనుకాల ఉన్న ఆలయ పరి ధిలోని 18 పూజా సామగ్రి దుకాణాలకు ఆలయ అధికారులు ఇటీవల బహిరంగ, సీల్డ్ టెండర్లు నిర్వహించారు. టెండర్ దక్కించుకున్న వ్యాపారులకు ఏడాది కాలపరిమితితో దుకాణాలు కే టాయించారు. ఇందుకు సంబంధించి పలువురు వ్యాపారులు ఏడాది మొత్తానికి సంబంధించిన నగదును దేవస్థానానికి చెల్లించినట్లు తెలిపారు. అయితే. మాస్టర్‌ప్లాన్ పనుల్లో భాగంగా దుకా ణాలు తొలగించాల్సి రావడంతో అధికారులు వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. దీనిపై ఆలయ ఈవో అంజనాదేవి వివరణ ఇస్తూ.. టెండర్ ప్రక్రియ నిర్వహించిన సమయంలోనే ప్రతీ దుకాణాదారుకు ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభమైతే దుకాణాలు తొలగించాల్సి ఉంటుందని స్పష్టంగా చెప్పామని తెలిపారు. ఎంతకాలం దుకాణాలు వినియోగించుకుంటే అంతే మొత్తాన్ని లెక్కించి, మిగతా మొత్తాన్ని దుకాణాదారులకు తిరిగి చెల్లించే ప్రతిపాదనను దేవాదాయ కమిషనర్‌కు పంపినట్లు పేర్కొన్నారు. కమిషనర్ నుంచి ఆదేశాలు రాగానే 10రోజుల్లోపు అర్హులకు మిగతా మొత్తాన్ని చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


