గణేశ్‌ నిమజ్జనంలో | - | Sakshi
Sakshi News home page

గణేశ్‌ నిమజ్జనంలో

Sep 18 2026 2:09 AM | Updated on Sep 18 2026 2:09 AM

భక్తులు, ఉత్సవ కమిటీలు నిబంధనలు పాటించాలి మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు నీటిలోకి దిగే విషయంలో జాగ్రత్తలు

అప్రమత్తతే ప్రధానం

ఆదిలాబాద్‌టౌన్‌/ఆదిలాబాద్‌: గణేశ్‌ నిమజ్జన ఉత్సవాల్లో అపశ్రుతులు చోటుచేసుకుండా నిర్వాహకులు, యువత పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశంలో బుధవారం నిర్వహించిన నిమజ్జన కార్యక్రమంలో ఆరుగురు విద్యార్థులు చెరువులో మునిగి మృత్యువాతపడటం తీవ్ర విషాదం నింపింది. ఇలాంటి ఘటనలకు తావివ్వకుండా భక్తులు, ఉత్సవ కమిటీలు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ సూచిస్తున్నారు.

చెరువులు, కుంటల వద్ద..

నిమజ్జనం జరిగే చెరువులు, కుంటలు, నదులు, ఇతర నీటి వనరుల వద్ద భక్తులు అప్రమత్తంగా ఉండాలి. నిమజ్జన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటి లోతైన ప్రాంతాల్లోకి వెళ్లకూడదు. ప్రమాదకర ప్రదేశాల్లో నిలబడి ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడం, నీటిలోకి దూకడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు, ఇతర రక్షణ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలి. భారీ గణేశ్‌ విగ్రహాలను ఊరేగింపుగా తరలించే సమయంలో విద్యుత్‌ తీగలు, విద్యుత్‌ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదకరంగా వేలాడుతున్న తీగలు, ఇతర సమస్యలు కనిపిస్తే వెంటనే విద్యుత్‌ శాఖ అధికారులకు సమాచారం అందించాలి.

ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరి

నిమజ్జనం సందర్భంగా ప్రధాన రహదారి, కూడళ్లలో ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున వాహనదారులు పోలీసుల సూచనలు పాటించాలి. ఊరేగింపునకు ఆటంకం కలిగించేలా రోడ్లపై వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలిపివేయొద్దు. అత్యవసర సేవలైన అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు, పోలీసు వాహనాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా మార్గం కల్పించాలి. ఉత్సవకమిటీలు తమ వలంటీర్లను ఏర్పాటు చేసుకుని భక్తులను క్రమబద్ధంగా నడిపించేందుకు సహకరించాలని సూచిస్తున్నారు. దీంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్లాస్టిక్‌ కవర్లు, పూజాసామగ్రి, పూలు, ఇతర వ్యర్థాలను నిర్దేశించిన ప్రదేశాల్లో వేయాలని కోరుతున్నారు.

జాగ్రత్తలు తీసుకోవాలి..

గణేశ్‌ విగ్రహాలను నిమజ్జన ప్రాంతాలకు తరలించే సమయంలో ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాల డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి. వాహనాల్లో పరిమితికి మించి భక్తులను ఎక్కించుకోవద్దు. వాహనపత్రాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ తప్పనిసరిగా కలిగి ఉండాలి. నిమజ్జన వేడుకల్లో డ్రైవర్లు మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement