ముధోల్: కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో ముధోల్ గురుకుల పాఠశాలకు చెందిన ఐదోతరగతి విద్యార్థి జి.అఖిలేశ్ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు యోగా గురువు సాయినాథ్ తెలిపారు. అఖిలేశ్‌ను మంగళవారం పాఠశాలలో శాలువాతో సత్కరించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.
ఆలూరులో స్టీల్‌బ్యాంక్
సారంగపూర్: మండలంలోని ఆలూరు గ్రామంలో సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా వీడీసీ, గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్టీల్‌బ్యాంక్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గణేశ్ మండపం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీపీవో శ్రీనివాస్, సర్పంచ్ ఈర్ల చిన్నయ్య, ఎంపీడీవో లక్ష్మీకాంత్‌రావు, ఎంపీవో అజీజ్‌ఖాన్, పంచాయతీ కార్యదర్శి లింగయ్య, వీడీసీ సభ్యులున్నారు.


