ఎకో ఫ్రెండ్లీ విగ్రహాల తయారీ
నిర్మల్‌టౌన్: పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాలను తయారు చేశారు. ఎనన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ఆసక్తిగా పాల్గొని పర్యావరణహిత విగ్రహాలను స్వయంగా రూపొందించారు. విద్యార్థుల ప్రతిభను కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం. సుధాకర్ అభినందించారు. విగ్రహాలను ప్రొఫెసర్లకు, అధ్యాపకులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ యు.గంగాధర్, డాక్టర్ కె.సూర్యసాగర్, డాక్టర్ ఎం.రజిత, నాగ శ్రీనివాస్, రమేశ్‌రెడ్డి, పీజీ.రెడ్డి, హేమలత, శ్రీహరి, సుభాష్, అర్చన, త్రిపాఠి, నరేంద్ర, పవన్ తదితరులు పాల్గొన్నారు.
భైంసాటౌన్ పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వివేకానంద చౌరస్తా, టిప్పుసుల్తాన్ చౌక్‌లో వర్షపునీరు రోడ్డుపైకి వరద చేరడంతో వాహనాలు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు మోకాలు లోతు వరకు నీరు పారింది. డ్రెయినేజీల నుంచి వచ్చిన చెత్తాచెదారం రోడ్డుపై చేరింది. – భైంసాటౌన్


