అంగన్‌వాడీ వర్కర్ల అరెస్ట్‌ దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ వర్కర్ల అరెస్ట్‌ దుర్మార్గం

Sep 13 2026 12:06 AM | Updated on Sep 13 2026 12:06 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: తమ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న అంగన్‌వాడీ, ఆశ వర్కర్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధకాండ కొనసాగిస్తోందని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరసన దీక్షలు చేపట్టనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్‌ వెల్లడించారు. నిర్మల్‌లోని టీఎన్జీవో భవన్‌లో శనివారం నిర్వహించిన అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్‌ 8, 9 తేదీల్లో అంగన్‌వాడీ, ఆశ వర్కర్లు తలపెట్టిన ‘చలో హైదరాబాద్‌’ను పోలీసులతో ప్రభుత్వం భగ్నం చేయించిందని ఆరోపించారు. అర్ధరాత్రి బస్సుల నుంచి కార్మికులను దింపి అరెస్టు చేయించిందని పేర్కొన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రశ్నించే గొంతులను అణచివేస్తున్నారని దుయ్యబట్టారు. ధర్నా చౌక్‌పై అప్రకటిత నిషేధం విధిస్తూ కార్మిక సంఘాలకు ‘నో ఎంట్రీ‘ అనడం సరికాదన్నారు. ఈనెల 16న నిర్వహించే సామూహిక నిరసన దీక్షను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు కై ్లమేంట్‌ వెస్లీ, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు బి.లలిత, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.శైలజ, పట్టణ కార్యదర్శి కవిత, చంద్రకళ, ఉమ, అమత, రాజ్యలక్ష్మి, స్వరూప నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement