ఖైదీల సమస్యలపై ఆరా | - | Sakshi
Sakshi News home page

ఖైదీల సమస్యలపై ఆరా

Sep 3 2026 8:47 AM | Updated on Sep 3 2026 8:47 AM

నిర్మల్‌టౌన్‌: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పోరిక రవీందర్‌ బుధవారం నిర్మల్‌ సబ్‌జైలును సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నా రు. వారికి అందుతున్న న్యాయ సహాయం, ఇతర సౌకర్యాల గురించి వివరాలు సేకరించా రు. ఉచిత న్యాయ సహాయం, వారి హక్కులపై అవగాహన కల్పించారు. చీఫ్‌ ఎల్‌ఏడీసీఎస్‌ ఎ.రాజలింగం, నిర్మల్‌ సబ్‌జైలు సూపరింటెండెంట్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి తదితరులున్నారు.

కోర్టు పోలీసులతో సమావేశం

ఈ నెల 12న జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నందున జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో కోర్టు పోలీసులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పోరిక రవీందర్‌ సమావే శం నిర్వహించారు. లోక్‌ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కోర్టు పోలీస్‌ అధికారి రమేశ్‌, పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement