నిర్మల్‌ | - | Sakshi
Sakshi News home page

నిర్మల్‌

Sep 3 2026 8:47 AM | Updated on Sep 3 2026 8:47 AM

● కాంగ్రెస్‌ పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన గురువారం శ్రీ 3 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026 8లోu

న్యూస్‌రీల్‌

ఆగస్టులోనూ లోటు వర్షపాతమే.. ఈ సీజన్‌లో జూలై ఒక్కటే నయం జిల్లా వర్షపాతంలో హెచ్చుతగ్గులు పలు మండలాల్లో తక్కువ వర్షాలు

ఆర్డీవో ఆఫీస్‌లో డీసీసీ వినతి

కార్మికుల బండికి గోల్డెన్‌ జూబ్లీ

1976 సెప్టెంబర్‌ 2న ప్రారంభమైన సింగరేణి ఎక్స్‌ప్రెస్‌ రైలు గోల్డెన్‌ జూబ్లీ పూర్తి చేసుకుంది. ప్రై వేట్‌ రవాణాతో పోలిస్తే తక్కువ ఖర్చుతో దశాబ్దా లుగా ప్రయాణికులకు సేవలందిస్తోంది.

ఖానాపూర్‌ బల్దియాలో సమీక్ష

ఖానాపూర్‌: ఖానాపూర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు బుధవారం సమీక్ష నిర్వహించారు. ఇ టీవల మున్సిపాలిటీలో పాలకవర్గ సభ్యులు, అధికారుల మధ్య విభేదాలు నెలకొన్నట్లు వ చ్చిన ఆరోపణల గురించి పాత్రికేయులు ప్ర శ్నించగా, ఆ విషయం తన దృష్టికి రాలేదని అ దనపు కలెక్టర్‌ పేర్కొన్నారు. పాత్రికేయుల ద్వా రా విషయం తనకు తెలిసిందని, దీనిపై వివరా లు తెలుసుకుని అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అంకం మౌనిక, వైస్‌ చైర్మన్‌ షోయబ్‌, కౌన్సిలర్లు చి న్నం సత్యం, గుమ్ముల అశోక్‌, పోలంపల్లి రమే శ్‌, బొప్పారపు సత్యవతి, తోడసం ఇందిరా, కమిషనర్‌ సుందర్‌సింగ్‌ తదితరులున్నారు.

నిర్మల్‌: ‘‘జూన్‌, జూలైలో పడకుంటే ఏంది.. ఆగస్టు ఉంది కదా. భారీ వర్షాలన్నీ ఇదే నెలలో కురుస్తాయి కదా..!’’ అంటూ ఎదురుచూసిన జిల్లావాసుల ఆశలను ఆగస్టు ఆవిరి చేసింది. ఈసారి గణనీయమైన లోటు వర్షపాతాన్ని నమోదుచేసింది. మొత్తం మీద ఈ ఏడాది వానాకాలం సరిపడా జలసిరులను ఇవ్వకుండానే సర్దుకుంది. ఎల్‌నినో ప్రభావం కారణంగా ఇకముందు వర్షాలు కురుస్తాయన్న గ్యారంటీ లేదని వాతావరణశాఖ నివేదికలు చెబుతున్నాయి.

జూన్‌లో కొంత అధికం

2025జూన్‌లో జిల్లాలో సగటున 141.38 మి.మీ. వర్షపాతం నమోదవగా.. 2026 జూన్‌లో 147.51 మి.మీ. కురిసింది. అంటే.. గతేడాదితో పోలిస్తే 4.34 శా తం అధికం. అయితే, మండలాల వారీగా పరిస్థితి భిన్నంగా ఉండటం గమనార్హం. పెంబి, కుభీర్‌, భైంసా, కుంటాల, ఖానాపూర్‌, కడెం తదితర ప్రాంతాల్లో అధిక వర్షాలు నమోదవగా.. నిర్మల్‌రూరల్‌, కుభీర్‌, నిర్మల్‌ అర్బన్‌ తదితర ప్రాంతాల్లో లోటు కనిపించింది.

ఈసారి నిరాశపరిచిన ఆగస్టు

జూన్‌, జూలైలో కురిసిన వర్షాలతో సరిపడా జలసిరులు రాకపోవడంతో జిల్లావాసులు ఆగస్టుపై ఆశలు పెట్టుకున్నారు. దాదాపు ప్రతీసీజన్‌లో ఈ నెలలోనే ఎక్కువ భారీవర్షాలు కురిశాయి. కానీ, ఈ సీజన్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతేడాది ఆగస్టులో జిల్లా సగటు వర్షపాతం 221.07 మి.మీ. ఉండగా.. ఈసారి 114.93 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే.. గతేడాదితో పోలిస్తే 48.01 శాతం లోటు ఏర్పడింది. కుభీర్‌, తానూరు, భైంసా, కుంటాల, నర్సాపూర్‌ (జి), దస్తూరాబాద్‌ తదితర మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. నిర్మల్‌అర్బన్‌లో కూడా గతేడాది 223.3 మి.మీ.తో పోలిస్తే ఈ ఏడాది 182.7 మి.మీ. మాత్రమే వర్షం కురిసింది.

నిరసన తెలుపుతున్న నాయకులు, కార్యకర్తలు

ఎల్‌నినో ఎఫెక్ట్‌..

ఈ ఏడాది మొదటి నుంచీ వాతావరణశాఖ అధికారులు ఎల్‌నినో ప్రభావం ఉంటుందని వర్షాలు భారీగా కురిసే అవకాశాలు ఉండవని చెబుతూ వచ్చారు. జూలైలో భారీగా వర్షాలు కురవడం, వాతావరణం ఎప్పుడూ మబ్బు పట్టినట్లు ఉండటంతో ఎల్‌నినో ప్రభావం జిల్లాలో ఉండదని రైతులు, జిల్లా ప్రజలు భావించారు. మున్ముందు భారీవర్షాలు కురుస్తాయని ఆశించారు. కానీ.. ఆగస్టులో లోటువర్షపాతం నమోదు కావడంతో వారి ఆశలు ఆవిరయ్యాయి. ఇకముందు ఎల్‌నినో ఎఫెక్ట్‌ మరింత ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.

జూలైలో మాత్రం జోరుగా..

జూలై మాత్రం ఈ ఏడాది జిల్లాకు భారీ వర్షాలను అందించి తన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. 2025 జూలైలో జిల్లా సగటు వర్షపాతం 234.67 మి.మీ. కాగా.. ఈ సంవత్సరం ఏకంగా 368.03 మి.మీ. కురిసింది. దీంతో 56.83 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ముఖ్యంగా కడెం, సోన్‌, పెంబి, నిర్మల్‌ అర్బన్‌, ఖానాపూర్‌, దస్తూ రాబాద్‌ మండలాల్లో భారీగా వర్షాలు కురిశాయి. జూలైలో కురిసిన వర్షాలు పంటలకు భారీ ఊరటనిచ్చాయి.

మొత్తంగా చూస్తే ఎక్కువే కానీ..

మూడు నెలల వర్షపాతాన్ని కలిపి చూస్తే.. 2025లో జిల్లాలో మొత్తం 11,345.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఈఏడాది ఇదే కాలానికి 11,978.8 మి.మీ. నమోదైంది. అంటే.. గతేడాదితో పోలిస్తే 633.5 మి.మీ. అధికంగా, మొత్తంగా సుమారు 5.58 శాతం ఎక్కువ వర్షం కురిసింది. కానీ, మండలాల వారీగా పరిశీలించినప్పుడు చాలాచోట్ల తక్కువ వర్షపాతం నమోదైంది.

జిల్లాలో భారీ హె చ్చుతగ్గులు

జిల్లా వర్షపాతంలో ఈ ఏడాది భారీ హెచ్చుతగ్గులు నమోదయ్యాయి. 2025తో పోలిస్తే 2026 జూన్‌, జూలైలో అధిక వర్షపాతం నమోదైనా.. ఆగస్టులో మాత్రం వానలు ముఖం చాటేశాయి. జూన్‌ నుంచి ఆగస్టు వరకు నమోదైన గణాంకాలను పరిశీలిస్తే.. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొత్తం వర్షపాతం 633.5 మి.మీ. అధికంగా ఉన్నా.. ఆ వర్షాలన్నీ ఒకేవిధంగా కురవకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement