భైంసా: ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే గ్రీవెన్స్ డే ఉద్దేశమని ఎస్పీ జానకీ షర్మిల తెలిపారు. బుధవారం భైంసా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. భైంసా సబ్‌డివిజన్ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫి ర్యాదుదారుల సమస్యలను ఎస్పీ ఓర్పుగా విని పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. అలాగే, గ్రీవెన్స్ డేకు వచ్చి న కుటుంబ వివాదాలపై షీ టీం సిబ్బంది ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పరస్పర అవగాహన కల్పిస్తూ సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం గత గ్రీవె న్స్ డేల్లో వచ్చిన ఫిర్యాదుల పరిష్కార స్థితిపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. పెండింగ్ ఫిర్యాదుల వివరాలు అధికారుల ద్వారా తెలుసుకుని, వాటిని వేగంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.


