ఖానాపూర్: మారుమూల పల్లెటూరైనా రాష్ట్ర, జాతీయస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తోంది మస్కాపూర్. ఇక్కడి పీఎంశ్రీ జిల్లాపరిషత్ పాఠశాల విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణిస్తున్నారు. యోగా, వెయిట్‌లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్, వాలీబాల్, చెస్‌లో జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు సత్తా చాటుతున్నారు.
వెయిట్‌లిఫ్టింగ్‌లో రికార్డు
ఉమ్మడి జిల్లాలో వెయిట్‌లిఫ్టింగ్‌లో అత్యధిక రాష్ట్రస్థాయి పతకాలు సాధించిన పాఠశాలగా గుర్తింపు పొందింది. గత ఏడాది ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి పోటీల్లో తొమ్మిది పతకాలు (ఒక స్వర్ణం, ఆరు రజతాలు, రెండు కాంస్యాలు) సాధించారు.
జాతీయ వేదికపైనా ప్రతిభ
ఢిల్లీలో జరిగిన ఎస్‌జీఎఫ్ జాతీయస్థాయి వెయిట్‌లిఫ్టింగ్ పోటీల్లో 67 కిలోల విభాగంలో ఎం.శివసాయి తెలంగాణ తరఫున పా ల్గొని సత్తా చాటాడు. జిల్లా, జోనల్ పోటీలకు వేదికలు ఏర్పాటు చేయడంతోపాటు అంతర్జాతీయ క్రీడాకారుడు నాగరాజు సెమినార్ నిర్వహించి విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. దీంతో వారు క్రమం తప్పకుండా సాధన చేస్తూ కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేస్తున్నారు.


