ఆటల్లో అదుర్స్‌ | - | Sakshi
Sakshi News home page

ఆటల్లో అదుర్స్‌

Aug 28 2026 11:47 PM | Updated on Aug 28 2026 11:47 PM

● రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయక స్థాయికి జిల్లా క్రీడాకారులు ● మరింత ప్రోత్సాహం కావాలంటున్న ఆటగాళ్లు ● నేడు జాతీయ క్రీడా దినోత్సవం ● 2017లో పూణేలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో కాంస్య పతకం ● 2018లో సౌత్‌ జోన్‌ పోటీల్లో లాంగ్‌ జంప్‌లో సిల్వర్‌ మెడల్‌ ● 2019లో విజయవాడలో జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకం, అదే ఏడాది ఖేలో ఇండియా పోటీల్లో సిల్వర్‌ మెడల్‌ ● 2023లో 38వ జాతీయ స్థాయి పోటీల్లో 100 మీటర్ల హర్డిల్స్‌లో రజత పతకం ● 2024లో ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో బంగారు పతకం, ఇండియన్‌ ఓపెన్‌లో కాంస్య పతకం

28ఎన్‌ఆర్‌ఎల్‌126,126:క్రీడల్లో పాల్గొంటున్న నామాయి రుచిత

28ఎన్‌ఆర్‌ఎల్‌127:నామాయి రుచిత

దిలావర్‌పూర్‌: దిలావర్‌పూర్‌ మండల కేంద్రానికి చెందిన జాతీయ క్రీడాకారిణి నామాయి రుచిత, రా ష్ట్ర ప్రభుత్వం నుంచి కొంతమేర ప్రోత్సాహం కోరుకుంటోంది. సహకారం ఉంటే జాతీయస్థాయితో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ రాణిస్తానని ధీ మా వ్యక్తం చేస్తోంది. నామాయి నర్సవ్వ, ముత్యం దంపతుల కూతురు అయిన రుచితది మధ్యతరగతి రైతు కుటుంబం. చిన్నతనం నుంచి తల్లిదండ్రులకు పొలం పనుల్లో చేదోడు వాదోడుగా ఉంటూ పాఠశాల విద్యను కొనసాగించింది. దిలావర్‌పూర్‌లోని నాల్గో తరగతి వరకు చదివిన ఆమె క్రీడల్లో ప్రావీణ్యం సాధించడంతో హైదరాబాద్‌లోని హకీంపేట క్రీడా పాఠశాలలో సీటు సాధించింది. అక్కడి నుంచి కోచ్‌ల ప్రోత్సాహంతో 100 మీటర్ల హర్డిల్స్‌లో ఆరితేరింది. తర్వాత బెంగళూరులోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు ఎంపికై ంది.

సాధించిన విజయాలు

ఇటీవల ఢిల్లీలో జరిగిన పలు పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబర్చింది.

ఆటలు ఆరోగ్యంతోపాటు శారీరక, మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడతాయి. జీవితంలో గెలుపోటములను అర్థం చేసుకోవడం, వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని విజయంవైపు ముందుకు సాగడం నేర్పిస్తాయి. ఓర్పు, సహనం, ఏకాగ్రత, లక్ష్యం సాధించాలనే తపన, మానసిక స్థైర్యం వంటి గుణాలు కూడా క్రీడల ద్వారానే అలవడతాయి. క్రీడల్లో పాల్గొనే పిల్లలు చదువులోనే కాక జీవితంలో ఎదురయ్యే సమస్యలను చాకచక్యంతో ఎదుర్కోగలరని అనేక అధ్యయనాలు నిర్ధారిస్తున్నాయి. జాతీయ క్రీడ హాకీతో భారత్‌ పేరును ప్రపంచ పటంలో నిలిపిన మాంత్రికుడు మేజర్‌ ధ్యాన్‌చంద్‌. ఆయన జయంతి రోజు ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న నేపథ్యంలో జిల్లాలో వివిధ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులపై కథనం.

రుచిత..

అథ్లెటిక్స్‌ చిరుత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement