మామడ: మండలంలోని పొన్కల్ గోదావరి వద్ద పుష్కర ఘాట్ నిర్మాణం చేపట్టాలని, ఇందుకోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్‌బాబును కాంగ్రెస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌చార్జి కూచాడి శ్రీహరిరావు కోరారు. హైదరాబాద్‌లో శుక్రవారం కలిసి వినతిపత్రం అందించారు. సదర్మాట్ బ్యారేజీ నిర్మాణంతో గతంలో నిర్మించిన పుష్కరఘాట్లు ముంపుకు గురయ్యాయని తెలిపారు. నూతన పుష్కరఘాట్‌లు, గంగమాత విగ్రహ నిర్మాణం చేపట్టాలని కోరారు. వినతిపత్రం ఇచ్చినవారిలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మండల నాయకుడు కాలగిరి గంగారెడ్డి ఉన్నారు.


