భైంసాటౌన్: విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ఖేలో ఇండియా వుషూ శిక్షణ కేంద్రంలో శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ముందుగా క్రీడాకారులకు వివిధ వినోదాత్మక క్రీడా పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. యువత ప్రతిరోజూ క్రీడలు, వ్యాయామం, యోగా అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో కోచ్ శ్రీరాముల సాయికృష్ణ, కౌన్సిలర్ రజిత మహేశ్, స్థానికులు పాల్గొన్నారు.


