భూసమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

భూసమస్యలు పరిష్కరించాలి

Aug 28 2026 11:47 PM | Updated on Aug 28 2026 11:47 PM

● కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా ● తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్‌

నిర్మల్‌: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూసమస్యల దరఖాస్తులను ప్రాధాన్యత ప్రాతిపదికన వేగంగా పరిష్కరించాలని కలెక్టర్‌ భవేశ్‌మిశ్రా ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి తహసీల్దార్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. భూసమస్యల దరఖాస్తుల పరిష్కారంపై మండలాల వారీగా సమీక్షించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, క్షేత్రస్థాయి విచారణను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. తగిన ఆధారాలు లేని దరఖాస్తులను తిరస్కరించే సమయంలో అందుకు కారణాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. భూసమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని సూచించారు. రెవెన్యూ, సర్వే బృందాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement