సారంగపూర్: వృక్షాలను రక్షిస్తేనే మానవాళికి మనుగడ ఉంటుందని అందుకే రక్షాబంధన్ రోజున వృక్షాలను రక్షించాలన్న ఉద్దేశంతో వృక్ష రక్షాబంధన్ నిర్వహించామని డీఆర్వో నజీర్‌ఖాన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పార్కును సందర్శించేందుకు వచ్చిన పర్యాటకులు, వాకర్స్‌కు ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన రాఖీలను అందించి వృక్షాలకు కట్టించారు. ఏటా ఒక మొక్కను నాటి దానిని సంరక్షిస్తే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. తమ పిల్లల పుట్టినరోజు, పెళ్లిరోజు, ఇతర ప్రత్యేక రోజుల్లో మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలన్న కాంక్షను పెంచడానికే ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు.


