కుభీర్: భూగర్భ జలాల పెంపునకే జిల్లాలో నీటి కుంటల తవ్వకం పనులు చేపట్టినట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా పేర్కొన్నారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా మండలంలోని దొడర్నాలో గురువారం నీటికుంటల నిర్మాణాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. నీటి కుంటలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని, నిర్మాణాలు వేగవంతం చే యాలని సూచించారు. జిల్లాలో గురువారం ఏకకా లంలో 573 నీటికుంటల నిర్మాణ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా రైతు దంపతులను కలెక్టర్ సన్మానించారు. డీఆర్డీవో విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ శ్రీదే వి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో భీమేశ్, ఏవో సా రిక, ఏపీఎం హరిలాల్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చవాన్ శంకర్, స్థానిక సర్పంచ్ జాదవ్ నిర్మల, మాజీ సర్పంచ్ రాథోడ్ శంకర్ తదితరులున్నారు.


