సంపత్‌కుమార్‌కు విశిష్ట కథా రచయితగా గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

సంపత్‌కుమార్‌కు విశిష్ట కథా రచయితగా గుర్తింపు

Jul 24 2026 1:45 AM | Updated on Jul 24 2026 1:45 AM

నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రానికి చెందిన కథా రచయిత టి.సంపత్‌కుమార్‌కు ముల్కనూరు సాహితీ పీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన సాహిత్యోత్సవంలో విశిష్ట కథా రచయితగా అరుదైన గుర్తింపు లభించింది. తెలుగు కథా సాహిత్యానికి ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ మొత్తం ఐదుగురు రచయితల్లో ఒకరిగా ఎంపిక చేసి సత్కరించారు. ఈ నెల 19న సంపత్‌కుమార్‌ రచించిన నాలుగో కథాసంపుటి ‘అందమైన నరకం‘ను సీఎం కార్యాలయ ఓఎస్డీ వేముల శ్రీనివాసులు ఆవిష్కరించారు. సన్మాన సభకు ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కోదండరాం, ప్రజాగాయకుడు జయరాజ్‌ ముఖ్య అతిథులుగా హాజరై సంపత్‌కుమార్‌కు రూ.5వేల నగదు, జ్ఞాపిక అందజేసి సత్కరించారు. 1979 నుంచి ఆయన తెలుగు, ఇంగ్లిష్‌లో విశిష్ట రచనలు, 70 కథలు, మూడు కథాసంపుటాలు, 250కిపైగా వ్యాసాలు వెలువరించారు. ఖానాపూర్‌కు చెందిన ఆయన నిర్మల్‌, హైదరాబాద్‌, ఢిల్లీలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఉద్యోగరీత్యా 35 ఏళ్లు ఢిల్లీలోని కెనడా రాయబార కార్యాలయంలో సేవలందించి, రిటైర్డ్‌ అయ్యాక 2016 నుంచి జిల్లాకేంద్రంలో స్థిర నివాసముంటున్నారు. భార్య మాధవీలత సహకారంతో ప్రకృతికి చేరువగా వ్యవసాయం, పశుపోషణ, కూరగాయల సాగులో నిమగ్నమై సాహిత్య సృజనను కొనసాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement