ఇంటర్‌ విద్యకు నూతన సాంకేతికత | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యకు నూతన సాంకేతికత

Jul 24 2026 1:45 AM | Updated on Jul 24 2026 1:45 AM

● ‘డిజిటల్‌’ ప్యానెళ్ల ద్వారా బోధన ● కళాశాలల బలోపేతం కోసమే..

లక్ష్మణచాంద: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. మౌలిక వసతులు కల్పించడమే కాకుండా ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేస్తోంది. ఖాన్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కార్పొరేట్‌కు దీటుగా నీట్‌, జేఈఈ, ఎఫ్‌సెట్‌, క్లాట్‌ తరగతులను డిజిటల్‌ ప్యా నెల్‌ బోర్డుల ద్వారా నిర్వహిస్తోంది. ఇంటరాక్టివ్‌ ఫ్లా ట్‌ ప్యానెల్స్‌, కంప్యూటర్‌, ప్రొజెక్టర్‌, టీవీ, వైట్‌ స్క్రీ న్‌ కలయికతో కూడిన అధునాతన టచ్‌ స్క్రీన్‌ పరికరాలు బోధనను అత్యంత ఆకర్శణీయంగా, సులభంగా మారుస్తున్నాయి. వీటి సాయంతో బోధనతోపాటు యానిమేటెడ్‌ వీడియోలు, చిత్రాలు, త్రీడీ నమూనాలు, ఆన్‌లైన్‌ సిమ్యులేషన్స్‌ ద్వారా విద్యార్థులకు అత్యంత క్లిష్టతరమైన భావనలను కూడా సులభంగా అర్థమయ్యేలా వివరించే అవకాశముంది. విద్యార్ధులు స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లను ప్యానెల్‌కు కనెక్ట్‌ చేసి తాము చేసిన ప్రాజెక్టుల ను తరగతి గదిలో ప్రదర్శించే వీలుంది. అధ్యాపకులు బోధించే పాఠ్యాంశాలను ముందుగానే సిద్ధం చే సుకోవచ్చు. తెరపై నమోదు చేసిన డేటా, నోట్స్‌ను డిజిటల్‌ ఫార్మాట్‌లో పీడీఎఫ్‌ లేదా ఇమేజ్‌లుగా సేవ్‌ చేసి విద్యార్థుల వాట్సాప్‌ లేదా ఈ మెయిల్‌కు పంపవచ్చు. జిల్లాలో 13 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలుండగా ప్రతీ కళాశాలకు నాలుగు చొప్పున ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ వచ్చినట్లు డీఐఈవో పరశురామ్‌ నాయక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement