భైంసాటౌన్: ఓటరు జాబితా ప్రత్యేక సవరణలో భాగంగా చేపట్టిన ఎస్‌ఐఆర్ ప్రక్రియలో అర్హుల ఓట్లు తొలగిపోకుండా చూడాలని కాంగ్రెస్ ఎస్ ఐఆర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి ఆరెపల్లి మోహన్ సూచించారు. పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే బి.నారాయణరావు పటేల్ అధ్యక్షతన గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఎస్‌ఐఆర్‌పై నిర్వహించిన అవగాహన సమావేశానికి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ సానుకూల ఓట్లు తొలగించాలన్న దురాలోచనతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్‌ఐఆర్ చేపట్టిందని ఆరోపించారు. దీన్ని తిప్పి కొట్టేందుకు అర్హుల ఓట్లు తొలగిపోకుండా క్షేత్ర స్థాయిలో పార్టీ బీఎల్‌ఏలు చూడాలని సూ చించారు. ప్రతీ నాయకుడు, కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి ఓటర్లు వందశాతం ఎస్‌ఐఆర్ ప్రక్రియను సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అనంత రం డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలా చారి, ముధోల్ ఎస్‌ఐఆర్ ఇన్‌చార్జి రాంరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు నారాయణరావు పటేల్, విఠల్‌రెడ్డి ఎస్‌ఐఆర్‌పై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఏఎంసీ చైర్మన్ ఆనంద్‌రా వు పటేల్, పార్టీ పట్టణాధ్యక్షుడు అరవింద్, మండలాధ్యక్షులు, ఆత్మ చైర్మన్లు పాల్గొన్నారు.


