నిర్మల్ రూరల్: ఉపాధ్యాయులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను సద్విని యోగం చేసుకోవాలని జిల్లా విద్యాధికారి భో జన్న సూచించారు. జిల్లాలోని గణిత ఉపాధ్యాయులకు మూడురోజులుగా నారాయణ పాఠశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా డీ ఈవో శిక్షణ తరగతులను పరిశీలించారు. ఆ యన మాట్లాడుతూ.. విద్యార్థులకు గుణాత్మ క విద్యను అందించి, సర్కారు పాఠశాలలపై ప్రజల నమ్మకాన్ని పెంచాలని సూచించారు. విద్యార్థుల నమోదు పెంచడంలో గణిత ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఉ పాధ్యాయులు యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పద్ధతి ద్వారా బోధించి విద్యా ప్రమాణాలు పెంచా లని సూచించారు. కార్యక్రమంలో ఏఎంవో నర్సయ్య, కోర్సు ఇన్‌చార్జీలు పరమేశ్వర్, జ నార్దన్, రిసోర్స్ పర్సన్లు పద్మ, సదానందం, విజయకుమార్, అపర్ణ, హరిప్రసాద్, శేఖర్ వర్మ, పరాజ్, రవీందర్ తదితరులున్నారు.


