నిర్మల్‌టౌన్: ప్రజలు, వాహనదారులకు ట్రా ఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపా రు. ఎస్పీ జానకీషర్మిల ఆదేశాల మేరకు డీఎ స్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీస్ బృందం గురువారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో చర్యలు చేపట్టారు. బస్టాండ్, ఆటో స్టాండ్, అంబేడ్కర్ చౌక్, మయూరి హోటల్, కిసాన్ షాపింగ్ మాల్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ అంతరాయం కలిగించే ఆక్రమణలు, రహదారులపై చిరు వ్యాపారలతో మాట్లాడా రు. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చ ర్యలు తీసుకుంటామన్నారు. రహదారులపై పార్కింగ్‌ను నివారించి వాహనాలను నిర్దేశిత పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపేలా చేస్తామన్నారు. డీఎస్పీ వెంట సీఐలు సమ్మ య్య, కృష్ణ, ఆర్‌ఐలు రామ్‌నిరంజన్, రామకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


