ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

Jul 10 2026 7:52 AM | Updated on Jul 10 2026 7:52 AM

● కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా

నిర్మల్‌చైన్‌గేట్‌: ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా సూచించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తు మ్మల నాగేశ్వరరావు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి సంజయ్‌జాజు హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జూలై 30 వరకు ఎల్‌నినో ప్రభావానికి సంబంధించి వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలించాలన్నారు. వర్షపాతం ఆశించిన స్థాయిలో లేకపోతే వ్యవసాయ రంగంపై ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి, అవసరమైన ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. జిల్లాలోని చెరువులు, రిజ ర్వాయర్లు, ఆనకట్టలు, కాలువలు తదితర నీటి పారుదల వనరుల పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహించాలని సూచించా రు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతీ శాఖ ముందస్తు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌, డీఏవో అంజిప్రసాద్‌, ఉద్యానవన శాఖ అధికారి రమణ, సీపీవో గంగారెడ్డి, నీటి పారుదల శాఖ అధికారులు అనిల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement