రుణాల రికవరీలో గోల్‌మాల్‌ | - | Sakshi
Sakshi News home page

రుణాల రికవరీలో గోల్‌మాల్‌

Jul 10 2026 7:52 AM | Updated on Jul 10 2026 7:52 AM

మొన్న గోసంపల్లిలో రూ.16 లక్షలు.. నేడు పాత ఎల్లాపూర్‌లో రూ.11.45 లక్షలు.. సీ్త్రనిధి రీపేమెంట్‌లో అక్రమాల పరంపర

ఖానాపూర్‌: ఖానాపూర్‌ మండలంలో సీ్త్రనిధి స్వ యం సహాయక సంఘాల రుణాల రికవరీ ప్రక్రియలో వరుసగా అక్రమాలు బయటపడుతున్నాయి. ఇ టీవల గోసంపల్లి గ్రామంలో రూ.16 లక్షలకు పైగా రికవరీ చేసిన నగదు సభ్యుల ఖాతాల్లో జమ కాలేదని సోషల్‌ ఆడిట్‌లో గుర్తించారు. తాజాగా పాత ఎల్లాపూర్‌ గ్రామంలోనూ రూ.11,45,265 దుర్విని యోగం అయినట్లు సోషల్‌ ఆడిట్‌లో తేలింది. ఆద ర్శ స్వయం సహాయక సంఘం సభ్యులు సీఏపై ఫి ర్యాదు చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించింది. మంచిర్యాలకు చెందిన సోషల్‌ ఆడిటర్‌ భూమక్క, కరీంనగర్‌కు చెందిన సోషల్‌ ఆడిటర్‌ మీనా మూడు రోజులు గ్రామంలోనే ఉండి వివరాలు సేకరించారు. సభ్యులను నేరుగా కలిసి రుణాల పంపిణీ, రికవరీలు, రీపేమెంట్లు, నగదు లావాదేవీలు, ఖాతాల నిర్వహణపై సమగ్ర సమాచారం తీసుకున్నారు. సభ్యుల వద్ద ఉన్న పాస్‌బుక్కులు, వోచర్లు, లావాదేవీ రికార్డులు, ఇతర పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సంబంధిత శాఖ అధికారులు, బ్యాంకు ప్రతినిధుల నుంచి కూడా వివరాలు సేకరించారు.

ఖాతాలో జమ చేయకుండా..

ప్రాథమిక విచారణలో రుణాల రికవరీ పేరుతో సభ్యుల నుంచి వసూలు చేసిన నగదు మొత్తంలో సుమారు రూ.11,45,265 సంబంధిత ఖాతాల్లో జమ కాలేదని, రికార్డుల్లో వ్యత్యాసాలు, ఖాతాల నిర్వహణలో అసమానతలు, నగదు లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్లు సోషల్‌ ఆడిట్‌లో బయటపడింది.

రికవరీకి సభ్యుల డిమాండ్‌..

మహిళా సంఘాల సభ్యులు తమ గ్రూపుల నిధులు, బ్యాంకు రుణాలు, రీపేమెంట్లకు సంబంధించిన అన్ని లెక్కలను పూర్తిస్థాయిలో పరిశీలించి, దుర్వినియోగమైన నిధులను తిరిగి రికవరీ చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్‌ ఆడిట్‌ అధికారులను కోరారు. సమగ్ర విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అధికారుల మధ్య ఆరోపణలు..

ఈ వ్యవహారంపై వీవోఏ రమ స్పందిస్తూ, రికవరీలో జరిగిన అక్రమాలకు తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సభ్యుల నుంచి వసూలు చేసిన నగదు మొత్తాన్ని సీ్త్రనిధి అసిస్టెంట్‌ మేనేజర్‌ మహేందర్‌కు నగదు రూపంలో అప్పగించానని, ఆ తర్వాత బ్యాంకులో జమ చేయడం పూర్తిగా ఆయన బాధ్యత అని పేర్కొన్నారు. అసిస్టెంట్‌ మేనేజర్‌ మహేందర్‌ ఈ ఆరోపణలను ఖండించారు. వీవోఏ రమ తనకు ఎలాంటి నగదు ఇవ్వలేదని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement